30-10-2025 01:13:58 AM
సీపీ అంబర్ కిషోర్ ఝా
జైపూర్, అక్టోబర్ 29: జైపూర్ సబ్ డివిజ న్ పోలీస్ ఆధ్వర్యంలో మండలంలోని ఇందారంలో మెగా రక్తదాన శిబిరం, ఓపెన్ హౌస్ కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ భాస్కర్ తో కలిసి శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విధి నిర్వాహ ణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరువ దని, వారి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందన్నారు.
రక్తదానం ప్రాణధానంతో సమానమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాలను కాపాడడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఓపెన్ హౌస్ లో ఏర్పాటు చేసిన స్టాళ్లు అందరిని ఆకట్టుకున్నా యి. ఈ సందర్భంగా స్నిఫర్ డాగ్స్ తమ ప్రతిభతో ఆకట్టుకోగా, విద్యార్థులు ఆసక్తిగా వీక్షిం చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్, చెన్నూర్ సీఐ దేవేందర్, చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్, మహిళ పోలీస్ స్టేషన్ సీఐ కె నరేష్, జైపూర్ ఎస్‌ఐ శ్రీధర్, శ్రీరాంపూర్ ఎస్‌ఐ సంతోష్, లక్ష్మి ప్రసన్న, సిబ్బంది పాల్గొన్నారు.