23 May, 2026 | 12:02 PM

ఆటిజమ్ గుట్టు తెలిసింది

21-08-2024 01:03 PM

యేల్: ఆటిజమ్ తో బాధపడే పిల్లలలో సామాజిక సంబంధాలు పెంచుకోలేక సతమవుతూ ఉంటారు. ఈ పరిస్థతి వారి చదువులో వెనుక బాటు తనానికి కారణమవుతూ తరగతిలోని మిగతా పిల్లలతో పోలిస్తే  వారి ఎదుగుదల తక్కువగా ఉంటుంది. తాజాగా యేల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో  ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్ వెనుక కారణాలు కనుగొన్నారు. దాదాపు 200 మంది నవజాత శిశువులలో బొడ్డు తాడు నుంచి సేకరించిన రక్తపు నమూనాలలో బయోకెమికల్ ను విశ్లేషించారు. పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్ (పీయూ ఎఫ్ఏ) కారణమని నిర్ధారించారు. బొడ్డు తాడులో అరాకిడోనిక్ ఆసిడ్ కూడా కారణమని తెలిపారు. కాగా శిశువుల బొడ్డుతాడు రక్త నమూనాలను పరీక్షించడంతో ముందే నిర్ధారించి చికిత్స మొదలు పెట్టి ఆటిజమ్ రాకుండా నివారించొచ్చని తెలిపారు.