9 May, 2026 | 9:42 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ మంచు చరియలు

01-03-2025 01:12 AM
  1. చిక్కుకున్న 57 మంది కూలీలు.. 32 మందిని రక్షించిన రెస్క్యూ టీం
  2. 25 మంది కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు

డెహ్రాడూన్, ఫిబ్రవరి 28: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో శుక్రవారం మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ మంచు చరియల కింద 57 మంది కూలీలు చిక్కుకోగా వారిలో 32 మం దిని రెస్క్యూ సిబ్బంది దగ్గరలో ఉన్న క్యాంపునకు తరలించారు. మిగిలిన 25 మంది కూలీలను రక్షించడం కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ స్థాయిలో మంచు కురుస్తోంది.

దీంతో భారత సైన్యం ఇండియా సరిహద్దుకు చేరుకోవడానికి వీలు లేకుండా మనా గ్రామం, మనా పాస్‌ల మధ్య లో గల బద్రీనాథ్ జాతీయ రహదారిపై మంచు పేరుకుపోయింది. రహదారిపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు 57 మంది కూలీలు రంగంలోకి దిగారు. మంచు తొలగిస్తుండగా మంచు చరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. దీంతో 57 మంది మంచు చరియల కింద చిక్కుకున్నారు. విషయం తెలియగానే ఇండో టిబెటియన్ పోలీసులతో కలిసి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్‌వో) సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే 32 మంది కూలీలను మంచు చరియల కింద నుంచి వెలికి తీసి దగ్గర్లోని ఆర్మీ క్యాంపునకు తరలించారు. మిగిలిన కూలీలను రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక సిబ్బంది రక్షిం చిన 32 మందిలో పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు.

మంచు చరియల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే విపత్తు నిర్వహణ బృందాన్ని అప్రమత్తం చేసినట్టు పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి  కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకా కుండా కార్మికులను రక్షించడమే లక్ష్యం గా ప్రభుత్వం పని చేస్తుందని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.