23 July, 2026 | 2:36 AM

సత్య సింధుజకు అవార్డు

23-07-2026 01:24 AM

లండన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ‘భారత్ సమ్మాన్ పురస్కార్’

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సిద్ధ వైద్యురాలు, చక్ర సిద్ధ హోలిస్టిక్ హీలింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకురాలు డాక్టర్ సత్య సింధుజకు లండన్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ప్రతిష్టాత్మక భారత్ సమ్మాన్ పురస్కార్ ప్రదానం చేశారు. న్యూఢిల్లీకి చెందిన కాన్‌ఫ్యూయెన్‌స ఫౌండేషన్ నిర్వహించిన భారత్ మహోత్సవ్ కార్యక్రమంలో లార్డ్ రాజ్ లూంబ సమక్షంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.

కార్యక్రమంలో ఒడిశా ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్, డాక్టర్ లక్ష్యరాజ్ సింగ్ మేవార్, నిర్వాహకులు డాక్టర్ అమితాబ్ శ్రీవాస్తవ, డాక్టర్ స్మితా శ్రీవాస్తవ పాల్గొన్నారు. ప్రాచీన సిద్ధ వైద్య విధానంలో పరిశోధనలు, పేషెంట్ కేర్ రంగాల్లో విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.

హౌస్ ఆఫ్ లార్డ్సో్ల ఈ గౌరవాన్ని అందుకున్న హైదరాబాద్‌కు చెందిన తొలి ప్రముఖ వ్యక్తిగా డాక్టర్ సత్య సింధుజ నిలిచారు. డాక్టర్ సత్య సింధుజ మాట్లాడుతూ.. ఈ పురస్కారం తనకే కాకుండా భారతీయ సిద్ధ వైద్య వ్యవస్థకు, తన గురువులకు, బృందానికి, తనపై నమ్మ కం ఉంచిన ప్రతి పేషెంట్కు దక్కిన గౌరవమని అన్నారు. ఆమె సాధించిన ఈ ఘన తపై సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్, శిల్పా శిరోద్కర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.