23 July, 2026 | 2:33 AM

కామారెడ్డిలో ప్రధాని మోదీ, ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మల దహనం

23-07-2026 01:25 AM

కామారెడ్డి, జూలై 22 (విజయక్రాంతి): ఏఐసీసీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పిలుపుమేరకు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి పట్టణంలోని రామారెడ్డి రోడ్డులో గంజి గేటు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ, నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.

అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు ప్రజల తరఫున ప్రశ్నించడం నేరం కాదని, రాహుల్ గాంధీపై తీసుకున్న చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, విద్యార్థుల భవిష్యత్తును కాపాడడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని, ప్రజల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, మాజీ డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమా రాణి శ్రీనివాస్,డిసిసి ఉపాధ్యక్షుడు పండ్లరాజు, గుడుగుల శ్రీనివాస్, గోనె శ్రీనివాస్, భీమ్ రెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి ,రాజా గౌడ్ , పాత రాజు, గాల్ రెడ్డి, సుదర్శన్, నౌసిలాల్ నాయక్, ఆశ బోయిన శ్రీనివాస్, కౌన్సిలర్లు, అంజద్, జావిద్, లడ్డు, యూనిస్,సిద్ధిక్, కళ్లెం సత్యం, సుధాకర్ రెడ్డి, సిరాజుద్దీన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు భూమని బాలరాజ్, రాంకుమార్, సయ్యద్ మసూద్ అలీ, సుదర్శన్, బీసీ సెల్ అధ్యక్షుడు పుట్నాల శ్రీనివాస్ యాదవ్, అన్వర్, కళ్లెం సత్యం, కోయల్కర్ కన్నయ్య, జనగామ రాజు, అస్రర్,అంకం రాజు, మోతిలాల్, ముజా హిద్ అలీ, లక్క పతిని గంగాధర్, సర్వర్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు భరత్ ,సురేష్ ,డేవిడ్ సుఫియన్, అనిరుద్, కౌన్సిలర్లు, జిల్లా కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్యూఐ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.