సైబరాబాద్‌లో సురక్షా కవచ్ ఛాంపియన్లకు అవార్డులు
శేరిలింగంపల్లి, ఆగస్టు 4 (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీసులు, ఎస్సిఎస్సి, తెలంగాణ రైజింగ్ ఇనిషియేటివ్ల సంయుక్త ఆధ్వర్యంలో ‘సురక్షా కవచ్ అభినందన అవార్డులు 2025-26’ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. సురక్షా కవచ్ క్లబ్ల ద్వారా పాఠశాలల్లో సురక్షిత వాతావరణం నిర్మించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, సంస్థలను సత్కరించారు. డీసీపీ కె. పుష్ప ఐ పీఎస్ నేతృత్వంలో విద్యార్థులతో కలిసి పా ల్గొన్నారు.
సమావేశంలో ఆమె మాట్లాడు తూ మానసిక ఆరోగ్యం, కౌన్సెలింగ్, పోలీసు-ఇండస్ట్రీ మార్గదర్శకత్వం పెంచాలని విద్యార్థులు సూచించారు. క్లబ్లను మరింత సమగ్రంగా చేయాలని, విద్యార్థి మార్గదర్శకులను తయారు చేయాలని డీసీపీ సూచించారు.సురక్షా వీర్, సురక్షా సహాయక్, సుర క్షా గురు, సురక్షా ప్రతిమాన్ విభాగాల్లో అ వార్డులు ప్రదానం చేశారు. కలిసి సురక్షిత రేపటిని నిర్మిద్దాం అనే నినాదంతో ఈ కార్యక్రమం ముగిసింది.






