5 August, 2026 | 2:42 AM

ఎమ్మెల్యేను కలిసిన జర్నలిస్ట్‌లు

05-08-2026 01:38 AM

ఐజేయూ దేవరకద్ర మండల నూతన మండల కమిటీని సన్మానించిన ఎమ్మెల్యే జీఎంఆర్ 

దేవరకద్ర ఆగస్టు 4 (విజయక్రాంతి): దేవరకద్ర మండల ఐజేయూ యూనియన్ నూతన కమిటీ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన వార్త రిపోర్టర్ యాకుబ్ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సమస్యల గురించి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ త్వరలోనే సొంత డబ్బులతో హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దిశా రిపోర్టర్ ప్రశాంత్, విజయ క్రాంతి రిపోర్టర్ కే శ్రీనివాసులు, ఉర్దూ రిపోర్టర్ వాషింగ్ బేగ్, నేటినేస్తం సంతోష్ ల్, జంగం సూరి, వార్త తరంగాలు విలేఖరి సారంగం తదితరులు పాల్గొన్నారు.