28 July, 2026 | 1:08 AM

హెపటైటిస్‌పై అవగాహన అవసరం

28-07-2026 12:41 AM

కేర్ ఆస్పత్రి వైద్యులు

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి) : ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం (జూలై 28) సందర్భంగా కేర్ హాస్పిటల్స్ వైద్యులు వైరల్ హెపటైటిస్‌పై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో సుమారు 2.9 కోట్ల మంది హెపటైటిస్- 55 లక్షల మంది హెపటైటిస్- జీవిస్తున్నప్పటికీ, చాలామందికి తమకు వ్యాధి ఉ న్న విషయం తెలియదని తెలిపారు. కేర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా.రఘురామ్ కొండాల మా ట్లాడుతూ..

హెపటైటిస్‌ను ముందుగానే గు ర్తిస్తే సిరోసిస్, లివర్ వైఫల్యం, లివర్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలను నివారించవచ్చన్నారు. కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ మెడిక ల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. ఆకాశ్ చౌధరి మాట్లాడుతూ.. హెపటైటిస్-బీని టీకాతో ని వారించవచ్చని, హెపటైటిస్-సీని ఆధునిక మందులతో పూర్తిగా నయం చేసే అవకాశం ఉందని తెలిపారు. ప్రమాద కారకాలు ఉన్నవారు తప్పనిసరిగా హెపటైటిస్ పరీక్షలు చేయించుకోవాలని, సమయానికి టీకాలు తీసుకోవడం, సురక్షిత రక్త మార్పిడి, పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ వ్యాధిని నివా రించవచ్చని వైద్యులు సూచించారు.