6 May, 2026 | 6:26 PM

వ్యవసాయ పథకాలపై రైతులకు అవగాహన

06-05-2026 05:55 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మూడవ రోజు  వ్యవసాయా మార్కెటింగ్ శాఖ, బ్యాంకు సిబ్బంది -రైతులకు అవగాహన కల్పించారు. కన్నాల రైతు వేదికలో రైతులకు పథకాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ సెక్రెటరీ భాస్కర్ కిసాన్ కాపాస్ ఆప్ గురించి వివరించారు. మార్కెటింగ్ శాఖ ద్వారా గల పధకాలను  రైతులకు వివరించారు. లీడ్ బ్యాంకు రేపర్సెంటేషన్ మేనేజర్ మాట్లాడుతూ రైతులు  క్రాప్ లోన్లు సకాలం లో తీసుకొని సకాలం లో తిరిగి చెల్లించాలని కోరారు. చాలా మంది రైతులు సకాలం లో చెల్లించకపోవడoతో వడ్డీ కట్టాల్సి వస్తుందన్నారు., సకాలంలో వడ్డీ మఫీ పొందాలనీ కోరారు.

అంకుశం ఉపసర్పంచ్ భాను చందర్ మాట్లాడుతూ బ్యాంకు ద్వారా రైతులకు రెన్యువల్ రెమైండర్ పంపాలని  కోరారు, కన్నాల సర్పంచ్ మాట్లాడుతూ బ్యాంకర్ లు రైతులకు పంట కాలానికి ముందస్తుగా పంట రుణాలు ఇవ్వాలని కోరారు, రైతులు కూడా పాత రుణాలు త్వరగా కట్టుకొని కొత్త  రుణాలు పొందాలన్నారు. వ్యవసాయం అధికారి ప్రేమాకుమార్ మాట్లాడుతూ రైతులు బ్యాంకింగ్ సేవలను, మార్కెటింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు, బ్యాంకర్లు, స్కేల్ of ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. కార్యక్రమం లో బెల్లంపల్లి ఉద్యాన వన అధికారి అర్చన, KVK శాస్త్రవేత్త Dr.సద్వి, AEO తిరుపతి రైతులు పాల్గొన్నారు.