8 July, 2026 | 1:06 AM

జాబితా సవరణపై అవగాహన కల్పించాలి

08-07-2026 12:23 AM

ఎస్‌ఐఅర్  కల్వకుర్తి ఇంచార్జి రజిని సాయిచంద్ పిలుపు

కడ్తాల్, జులై 7 (విజయక్రాంతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రజల్లో వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని కల్వకుర్తి నియోజకవర్గ ఎస్‌ఐఆర్ ఇన్చార్జి రజనిసాయి చంద్ సూచించారు. మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ గంపా వెంకటేష్ గుప్తాతో కలిసి ఆమె పర్యటించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ... భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ఎస్‌ఐఆర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగాలని, దీనిపై ప్రజలకు క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, మరణించిన వారి పేర్లను తొలగించడం, తప్పులను సరిచేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలనుసేకరించాలని, 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటు  హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, బీఎల్వోలు, కార్యకర్తలు పాల్గొన్నారు.