8 July, 2026 | 1:00 AM

అభివృద్ధికి కొత్త నిర్వచనం...

08-07-2026 12:13 AM

* ఇచ్చోడ మేజర్ గ్రామ పంచాయతీలో కొత్త ఊపు

* ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం

ఇచ్చోడ, జూలై 7 (విజయక్రాంతి): ఒకప్పుడు చిన్నచిన్న సమస్యల పరిష్కారం కోసం గ్రామస్థులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్య లోపాలు గ్రామాభివృద్ధికి అడ్డంకిగా నిలిచేవి. అయితే ఇప్పుడు అదే ఇచ్చోడ మేజర్ గ్రామ పంచాయతీ వేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది.

ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని, గ్రామాభివృద్ధినే ధ్యేయంగా సర్పంచ్ జలైజాకు, ఉప సర్పంచ్ లోక శిరీష్ రెడ్డిల నాయకత్వంలో గ్రామం కొత్త రూపు సంతరించుకుంటోంది. బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల వ్యవధిలోనే గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించి సుమారు రూ.కోటి విలువైన పనులకు శ్రీకా రం చుట్టడం గ్రామస్థుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ప్రజల అవసరాలను నేరుగా తెలుసుకుంటూ ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడుతుండటంతో గ్రామపంచాయతీ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది.

మాటల్లో కాదు.. చేతల్లో అభివృద్ధి

నా ఊరు.. నా బాధ్యత.. నా గ్రామం డెవలప్మెంట్.. అనే నినాదాన్ని కేవలం ప్రచా రానికే పరిమితం చేయకుండా కార్యరూపం దాల్చేలా చూస్తున్నారు సర్పంచ్. ప్రతి వార్డును సందర్శిస్తూ స్థానికులతో సమావేశమై సమస్యలను గుర్తించి వాటి పరిష్కా రానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తున్నారు.

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం...

గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, తాగునీటి సరఫరా మెరుగుదల, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య పనులు, చెత్త నిర్వహణ, మొక్కల పెంపకం, పచ్చదనం విస్తరణ, గ్రామ సుందరీకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రతి పని నాణ్యతతో పూర్తయ్యేలా పర్యవేక్షణ కొనసాగుతోంది.

ప్రజల వద్దకే పాలన...

గ్రామ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజాప్రతినిధులే వారి వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు. తాగునీరు, రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయో జనాలు అర్హులందరికీ అందేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధి...

గ్రామాభివృద్ధికి ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపూరావు ల సహకారం అందడంతో అభివృద్ధి పనులు మరింత వేగం పుంజుకున్నాయి. గ్రామ అవసరాలకు అనుగుణంగా నిధులు మంజూరు చేయించేం దుకు నిరంతర కృషి జరుగుతోంది.

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..

ఇచ్చోడ ను జిల్లా లోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం. ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తాం. అభివృద్ధి పనుల్లో వేగం, పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల సమర్థ అమలుతో ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీ కొత్త దిశగా అడుగులు వేస్తోంది.

జలైజాకు, సర్పంచ్