ఐటీ ఉద్యోగులకు డైలీ షటిల్స్ సేవలు
ప్రారంభించిన మంత్రి పొన్నం
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): నగరంలో ఐటీ కంపెనీల ఉద్యోగుల రోజువారీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా, సమయపాలనతో అందించేందుకు స్మార్ట్ డైలీ షటిల్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘డైలీ షటిల్స్’ సేవలను మంగళవారం హైదరాబాద్‌లోని జేఆ ర్‌సీ కన్వెన్షన్‌లో ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవా ణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై సేవలను ప్రారంభించారు. కార్య క్రమంలో పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రవాణా, రోడ్లు అండ్ భవనాల శాఖ) వికాస్ రాజ్, ఐఏఎస్, తెలంగాణ రవాణా కమిషనర్ కె. ఇలంబరితి, ఐఏఎస్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్, ఐపీఎస్, అదనపు రవాణా కమిషనర్ సి. రమే ష్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, డైలీ షటిల్స్ ద్వారా హైదరాబాద్‌లోని వివిధ ఐటీ కారిడార్లకు ఉద్యోగులు ప్రతిరోజూ సౌకర్యవంతంగా, సమయానికి, ట్రాఫిక్ ఒత్తిడి లేకుండా ప్రయాణించేలా ప్రత్యేక బస్సు సేవలను అందిస్తున్నామని తెలిపారు.
ఈ సేవల ద్వారా వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గడంతో పాటు ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అత్యాధునిక సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు, సమ యపాలన, సౌకర్యవంతమైన సీటింగ్, డిజిటల్ బుకింగ్ వంటి ప్రత్యేకతలతో ఉద్యోగులకు నాణ్యమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పర్యావరణ హితమై న, స్మార్ట్ నగర రవాణా వ్యవస్థ అభివృద్ధికి డైలీ షటిల్స్ ఒక కొత్త అడుగుగా నిలుస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు అభినందించారు.






