30 June, 2026 | 9:37 PM

Breaking News

దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •  

అట్రాసిటీ చట్టాలపై అవగాహన అవసరం

11-10-2025 12:00 AM

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కొన్ని ప్రత్యేకమైన నిబంధనలను రూపొందించారు. ఎస్సీ,ఎస్టీ వర్గాల ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం 1989లో రూపొందించిన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం, వికలాంగుల కోసం రూపొందించిన 2016 వికలాంగుల హక్కుల చట్టం ఈ వర్గాల ప్రజలకు రక్షణ కవచాలుగా చట్టం ద్వారా రక్షణ పొందే అవకాశముంది.

ఎస్సీ, ఎస్టీ, వికలాంగులపై దాడులు జరిగినా, భూముల ఆక్రమణ, కుల వివక్షత చూపిన వ్యక్తులపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం లేదంటే వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం శిక్షించాల్సిన అవసరముంది. ఈ వర్గాల ప్రజలకు న్యాయం చేయాలి. ఈ చట్టాలపై ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సహకార సంఘాల ద్వారా, వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా, పోలీస్ శాఖ ద్వారా అవగాహణ చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలి.

ప్రతి నెల 30వ తేదీన ఎస్సీ, ఎస్టీ కాలనీలతో పాటు వికలాంగుల సంఘాలతో సమావేశాలు నిర్వహించాలి. పౌరులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు వాల్ పెయింట్స్ వేయడం అవసరం. ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీచట్టాల కేసులు, వికలాంగుల కేసులను పెండింగ్‌లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలి.

 వెంకటేశ్వర్లు, నల్లగొండ