17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

రక్త సంబంధిత వ్యాధులపై అవగాహన

27-06-2025 01:54 AM

హెమోగ్లోబినోపతీలపై కిమ్స్ ఆసుపత్రిలో సదస్సు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 26 (విజయక్రాంతి): పిల్లల్లో కనిపించే జన్యుపర మైన రక్త సంబంధ వ్యాధులపై తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు, వైద్యులు అంతా అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచించారు. హెమోగ్లోబినోపతీలపై కిమ్స్ ఆసుపత్రిలో గురువారం జరిగిన సదస్సులో వైద్య కళాశాలల పీజీ విద్యార్థులు, బయోకెమిస్టులు, పాథాలజిస్టులు 150 మం ది పాల్గొన్నారు. మూడో తరగతి నుంచి ౮ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు రక్త పరీక్ష చేయడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి తెలుసుకోవచ్చని వైద్యులు తెలిపారు.

ఈ ర కం ప్రాథమిక పరీక్షలతో కొన్ని ఉత్తర భారతదేశ ప్రాంతాల్లో 810శాతం నుంచి 2030 శాతం పిల్లల్లో ఈ వ్యాధులు గుర్తయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ప్రభు త్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటిలోనూ పిల్లల రక్తపరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని కిమ్స్ ఆసుపత్రి హెమటో-ఆంకాలజీ విభాగాధిపతి, బోన్ మారో మార్పిడి నిపుణుడు డా క్టర్ నరేంద్ర కుమార్ తోటా అన్నారు.

ఈ వ్యాధులు తల్లిదండ్రులలో ఒకరికి లేదా ఇద్దరికి మైనర్గా ఉండే అవకాశం ఉంది. అలాం టి వారిలో పిల్లలకు చిన్న వయసులోనే తగిన రక్తపరీక్షలు చేయించడం వల్ల, థలసీమియా మేజర్ ఉంటే ముందుగానే తెలిసి పోతుందన్నారు. కిమ్స్ కడల్స్ ఆసుపత్రి పీడియాట్రిక్ హీమటో-ఆంకాలజీ విభాగం కన్స ల్టెంట్ డాక్టర్ చందన మారెడ్డి, సీనియర్ జనెటిక్ కౌన్సిలర్ డాక్టర్ పావనీ ఉపేంద్రం, ని మ్స్ ఆసుపత్రి బయోకెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎం.నూర్జహాన్ పాల్గొన్నారు.

హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ (హెచ్‌పిఎల్‌సి) అనే టెక్నాలజీ ద్వారా కూడా ఈ వ్యాధులను గుర్తించవచ్చని వివరించా రు. కిమ్స్ ఆసుపత్రుల ల్యాబ్ విభాగాధిపతి డాక్టర్ రాధికా చౌదరి సదస్సుకు నేతృత్వం వహించగా, డాక్టర్ మహమ్మద్ మౌనుద్దీన్, డాక్టర్ ఎం.ఎ. ముకీత్ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా వ్యవహరించారు.