ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన
16-05-2024 02:14 AM
ఝరాసంగం, మే 15 : ఝరాసంగం మండలంలోని కుప్పానగర్ గ్రామంలో బుధవారం జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సోమేశ్వరావు ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కలిపించారు. ఆయిల్‌పామ్ పంటను ఒకసారి వేసుకుంటే నాలుగు సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు రైతులకు స్థిరమైన ఆదాయం వస్తుందన్నారు. ఆయిల్ పామ్ పంటను సాగుచేసే రైతులకు ఒక ఎకరా మొక్కలకు రూ. 11,600, డ్రిప్‌కు రూ. 22,518, ఎరువులకు రూ. 16,800లు సబ్సిడీ ఉద్యానవనశాఖ ద్వారా రైతులకు అందిస్తారని తెలిపారు. రైతులు ఆయిల్‌పామ్ పంటను సాగు చేయడం వలన మంచి లాభాలు పొందువచ్చన్నారు. కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి స్పందన, గోద్రెజ్ యూరియా మేనేజర్ వెంకటేశ్వర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు భరత్, ఏసుబాబు, రైతులు పాల్గొన్నారు.




