10 March, 2026 | 12:42 AM

మహిళా చట్టాలపై అవగాహన

08-03-2026 04:21 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో విజన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా చట్టాలు ప్రాథమిక హక్కులపై అవగాహన కల్పించారు. విజన్ కోఆర్డినేటర్ శరత్ ఆధ్వర్యంలో కస్తూర్బా పాఠశాలలో బాలికలకు బాల్యవివాల నిషేధం, బాలికల హక్కుల పరిరక్షణ ఫోక్స్ చట్టం మహిళా హెల్ప్ లైన్ నంబర్లపై, సమాజంలో చదువు ప్రాధాన్యత తెలిపి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరువాకులు గంగాధర్ శిరీష హారిక జున్ను అనిల్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.