25 March, 2026 | 8:01 PM

భూగర్భ జలాల పరిరక్షణపై అవగాహన

25-03-2026 06:40 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు భూగర్భ జలాల పరిరక్షణ అవగాహన సదస్సు గురించి నిర్వహించి కూలీలతో ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్,డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ మహేష్,మండల అధికారులు గ్రామ సర్పంచ్ అనిత గోపాల్ గౌడ్లు కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...భూగర్భ జలాలను వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని,ప్రతి నీటి బొట్టు మనిషికి నీటి దప్పికను తీరుస్తుందని భూగర్భ జలాలను ఇష్టానుసారంగా వృధా చేయడం వల్ల రానున్న రోజుల్లో మన పిల్లలకు తాగడానికి ఒక నీటి చుక్క కూడా లభించదని భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భూగర్భ జలాలను వృధా చేయకూడదన్నారు.

భూగర్భ జలాలు తాగడానికి, వ్యవసాయానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయని కనుక ప్రజలందరూ భూగర్భ జలాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిత గోపాల్ గౌడ్,డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ మహేష్, డిఎల్పిఓ సురేందర్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీఓ ప్రభాకర్ చారి,ఏపీవో సాయిలు,కార్యదర్శి వనజ, ఫీల్డ్ అసిస్టెంట్ అంజి, తదితరులు పాల్గొన్నారు.