ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన
04-06-2026 12:48 AM
గాంధారి, జూన్ 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని తిప్పారం గ్రామ పంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ వినియోగం - దుష్పలితాలపై డిఎల్పిఓ సురేందర్ అవగాహన కల్పించారు.. గ్రామంలో గల కిరాణా షాపుల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సోలంకి ప్రమోద మాధవరావ్, పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్, స్థానిక నాయకులు మాధవరావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు..






