జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు బీభత్సం
04-06-2026 12:50 AM
- ద్విచక్ర వాహనదారుడు పైకి దూసుకెళ్లిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు
- బస్సు చక్రాల కింద ఇరుక్కున్న వ్యక్తి
- కాపాడిన మారేడుపల్లి పోలీసులు, తోటి ప్రయాణికులు
సికింద్రాబాద్, జూన్3 (విజయక్రాంతి): సికింద్రా బాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగం గా వాహనదారు డు పైకి దూసుకెళ్లింది. ఈ ఘటన లో శివ అనే ద్విచక్ర వాహనదారుడు బస్సు చక్రాల కింద ఇరుక్కుపోయాడు. దీన్ని గమనించిన మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులు వెంటనే అప్రమత్తమయ్యా రు. బైక్‌తో సహా ద్విచక్ర వాహనదారుడు బస్సు కింద ఇరుక్కుపోవడంతో చాలా సేపు శ్రమించి, క్రేన్ సహాయంతో బస్సును పక్కకు జరిపి బైక్ ను బయటకు తీసి బాధితుడు శివను రక్షించారు. అతడికి గాయాలు కావడంతో ఆసుపత్రి కి తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.






