27 May, 2026 | 12:59 AM

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన

27-05-2026 12:00 AM

చౌటుప్పల్, మే 26: తెలంగాణ ప్రభు త్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 25 నుండి 30 తేదీ వరకు నిర్వహించబడుతున్న మహిళా వారోత్సవాలు భాగం గా చౌటుప్పల్ బంగారుగడ్డ అంగన్వాడి సెంటర్ లో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ బాల్య వివాహాల బతుకు ఆగం బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలు చట్టపర్యమైన చర్యలు కు టుంబ వ్యవస్థను చేస్తూ ఆడ, మగ పిల్లలకు సమానంగా అవకాశాలు కల్పించాలన్నారు.

అనంతరం ఉమెన్స్ సేఫ్టీ కౌన్సిలర్ శ్రీవాణి మాట్లాడుతూ భార్య భర్తల మధ్య వచ్చే తగువులు పెద్దవి కాకుండా కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించే విధంగా చట్టం అవకాశం కల్పిస్తుందన్నారు. అని తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఎస్త్స్ర అజయ్ భార్గవ్, శ్రీనివాసచార్యులు, షీ టీం రవీందర్ రెడ్డి, అంగన్వాడి సూపర్వైజర్ శోభారాణి, స్కోప్ ఎన్జీవో బి నరసింహ రాజు, అంగన్వాడి టీచర్లు మరి యు పిల్లల తల్లులు పాల్గొన్నారు.