30 July, 2026 | 8:08 PM

Breaking News

భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •   బదిలీపై వెళ్తున్న డిఎంకు ఘన సన్మానం   •   పీర్జాదిగూడలో ఆగస్టు 9న బోనాల ఉత్సవాలు   •   బొల్లారంలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి   •   93/2 సర్వే నెంబర్లు పాసుపుస్తకాలు ఇవ్వాలి   •  

జీతాలు ఇవ్వాలని మోటార్ పంపు ఆపరేటర్ల నిరసన

27-05-2026 12:00 AM

నల్లగొండ టౌన్, మే 26: ఐదు నెలలుగా జీతాలు రావడంలేదని తెలంగాణ మిషన్ భగీరథ మోటార్ పంపు ఆపరేటర్ల పానగల్లు ఆర్ డబ్ల్యూ ఎస్ ప్లాంట్ కార్యాలయం వద్ద కాంట్రాక్టు కార్మికుల సంఘం మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. మోటార్ పంపు ఆపరేటర్ లు రాఘవ కంపెనీ పరిధిలో పనిచే స్తున్నారన్నారు. కానీ గత ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 30 మంది పంపు ఆపరేటర్లు రాఘవ కంపెనీలో కార్మికులుగా పనిచేస్తున్నారనీ జీతాలు ఇవ్వకపోవడంతో ఆ కుటుంబాలన్నీ రోడ్డునపడే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు.