1 July, 2026 | 11:26 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి..!

12-06-2025 05:12 PM

బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన..

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): 14 ఏళ్ల లోపు చిన్నారులు పనిలో కాకుండా బడిలో ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి నసీం సుల్తానా(District Judge Naseem Sultana) అన్నారు. గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పటంలోని పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై ఫిర్యాదు చేయవచ్చునని అందుకు టోల్ ఫ్రీ నెంవర్ 1098 అందుబాటులో ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బిస్కెట్లు, పుస్తకాలు, యూనిఫార్ములు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అడ్వకేట్లు, విద్యార్థులు పాల్గొన్నారు.