calender_icon.png 11 January, 2026 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

06-01-2026 12:00:00 AM

‘మేరా లాగిన్ - మేరా రూల్’ థీమ్‌తో కార్యక్రమం

మేడిపల్లి, జనవరి 5(విజయక్రాంతి): రాష్ట్ర  డీజీపీ  ఆదేశాల మేరకు సోమవారం మేడిపల్లి పోలీసులు అరోరా పీజీ కాలేజ్ బోడుప్పల్ ఆధ్వర్యంలో 300 మంది కాలేజీ విద్యార్థుల తో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరు వారాల కార్యక్రమంలో ఐదవ వారంలో ‘మేరా లాగిన్-మేరా రూల్ ’ అనే థీమ్‌తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆన్లైన్ మోసాలు, సైబర్ భద్రత, మోసాలు జరిగిన వెంటనే తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మి , ఏసీపీ శివ శంకర్, ఇన్‌స్పెక్టర్ మాధవి, మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.