calender_icon.png 11 January, 2026 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద కుటుంబానికి ‘జై భీమ్ యూత్’ బియ్యం పంపిణీ

06-01-2026 12:00:00 AM

నూతనకల్, డిసెంబర్ 5: మండల పరిధిలోని మిర్యాల గ్రామానికి చెందిన ఇరుగు ముత్తమ్మ  ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో, ఆ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న జై భీమ్ యూత్ కమిటీ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు.

ముత్తమ్మ గారి దశదిన కర్మ సందర్భంగా సోమవారం వారి కుటుంబానికి ఆర్థిక భారం తగ్గించేందుకు కమిటీ సభ్యులు అర క్వింటా బియ్యం విరాళంగా అందజేశారు.కష్టాల్లో ఉన్న వారికి తమ వంతు సాయం అందించడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు.  జై భీమ్ యూత్ సభ్యులు నాయకపు నాగరాజు, కొమ్ము సురేష్, ఇరుగు సతీష్, ఆంజనేయులు తదితరులున్నారు.