06-01-2026 12:00:00 AM
నూతన సర్పంచ్‌ను సన్మానించిన ఉపాధ్యాయులు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జనవరి 5: పాఠశాల అభివృద్ధికి మౌలిక వసతులు కల్పించి పాఠశాలలో విద్యాభివృద్ధికి తోడ్పడాలని ప్రధానోపాధ్యాయులు కే రమేష్ అన్నారు. మండల పరిధిలోని సూర్యానాయక్ తండా గ్రామ సర్పంచ్ గా నూతనంగా ఎన్నికైన లూనావత్ కృష్ణనాయక్, ఉపసర్పంచ్ డేగవత్ లక్ష్మీబాలాజీ నాయక్ లను సోమవారం పాఠశాల ఆవరణలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం మాట్లాడుతూ గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బయ్య లింగయ్య, అంగన్వాడి టీచర్ శివరంజని, విజయ, వార్డు సభ్యులు భూక్యా నర్సింహా, లునావత్ బిక్కు,బుజ్జిభద్రునాయక్, వీరన్న నాయక్, వెంకటేష్, బానోతు శిరీషరాజేష్ నాయక్, స్వామి, లాలు, రవీందర్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.