15 June, 2026 | 7:11 PM

Breaking News

సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •  

మెట్‌పల్లిలో జన గణన పై అవగాహన ర్యాలీ

11-05-2026 06:24 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): జనగణన-2027లో భాగంగా ఫేస్ - 1, హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సెస్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైనందున మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో జనగణన  న్యూమరేటర్లు, సూపర్వైజర్లు, వార్డ్ ఆఫీసర్స్ బిల్ కలెక్టర్స్ మున్సిపల్ సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు.  ఈ సందర్భంగా మున్సిపల్  కమిషనర్ డి.శ్రీనివాస్ మాట్లాడుతూ... పట్టణంలో ప్రారంభమైన జనగణనకి ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎన్యుమరేటర్ లుగా, సూపర్వైజర్లుగా నియమించడం జరిగినది అని అన్నారు. ఎన్యుమరేటర్ లు  వారికి కేటాయించిన జనగణ చేసే గృహల వివరాలను స్వీకరిస్తారు.అలాగే ఎన్యుమరేటర్ సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు వారు అడిగిన వివరాలను ప్రజలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో యంఈవో కనకతార జనగణన ఎన్యూమరేటర్ లు, సూపర్వైజర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.