15 June, 2026 | 7:36 PM

Breaking News

హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •  

పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభం

11-05-2026 06:19 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం ఈజీఎస్ నిధులతో రూ.8 లక్షల వ్యయంతో నిర్మించిన టాయిలెట్లను సోమవారం గ్రామ సర్పంచ్ కళా రమేష్ ప్రారంభించారు. దీంతో ఇన్నాళ్లుగా పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు పరిష్కారం లభించిందని గ్రామస్థులు, పాఠశాల సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.నాణ్యత ప్రమాణాలతో టాయిలెట్ల నిర్మాణం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంలో ఇది కీలక అడుగుగా అభివర్ణించారు.