జన గణనపై అవగాహనా ర్యాలీ
12-05-2026 01:29 AM
జనగామ, మే 11(విజయక్రాంతి): జనగణన - 2027లో భాగంగా ఫేస్ - 1, హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సెస్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైనందున ఎమ్మార్వో మోసిన్ ఆధ్వర్యంలో జనగణన న్యూమరేటర్లు మరియు సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. ప్రారంభమైన జనగణనకి ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎన్యుమరేటర్ లుగా మరియు సూపర్వైజర్లుగా నియమించడం జరిగినది అని అన్నారు. ఎన్యుమరేటర్ లు వారికి కేటాయించిన జనగణ చేసే గృహల వివరాలను స్వీకరిస్తారు. అలాగే ఎన్యుమరేటర్ సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు వారు అడిగిన వివరాలను ప్రజలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యంఈవో జానకి ఆర్‌ఐ ఆంధ్రయ, ఎన్యూమరేటర్ లు,సూపర్వైజర్లు మరియు సిబ్బంది అన్ని పార్టీల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.






