12 June, 2026 | 1:24 AM

ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన సదస్సు

12-06-2026 12:01 AM

శ్రీరంగాపూర్, జూన్ 11: శ్రీరంగాపూర్ మండలం కంబాలాపురం గ్రామంలో ‘కేత్ బచావో అభియాన్‘ కార్యక్రమంలో భాగంగా రైతులు, ఉపాధి హామీ కూలీలకు ఆరుతడి పంటలు, నేల ఆరోగ్య పరిరక్షణ, సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా మదనాపూర్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రొఫెసర్లు మాధవి, అనిత మాట్లాడుతూ, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నందున రైతులు అధిక నీటి అవసరం ఉన్న వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. నేల పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించడం, సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వడం, పంట వైవిధ్యీకరణ ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని వివరించారు.