1 August, 2026 | 7:10 PM

విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి

01-08-2026 06:02 PM

- జడ్జి హిమబిందు

కంగ్టి,(విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందేలా గురుకులాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నారాయణఖేడ్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి హిమబిందు అన్నారు. శనివారం కంగ్టి మండలంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, వంటశాల,తరగతి గదులు, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు.

మెనూ ప్రకారం తయారు చేసిన భోజనాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించారు.అనంతరం విద్యార్థులతో మాట్లాడిన జడ్జి హిమబిందు, డ్రగ్స్, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, కోర్టు సిబ్బంది సంజీవ్ పాల్గొన్నారు.