పీఆర్టీయూ(టీఎస్)మండల నూతన కార్యవర్గం ఎన్నిక
01-08-2026 06:16 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): పీఆర్టీయూ(టీఎస్) మండల నూతన కార్యవర్గం ఎన్నిక శనివారం మండల కేంద్రం అర్వపల్లిలో జరిగింది.నూతన అధ్యక్షుడుగా 2వసారి ఉల్లెందుల సైదులు,ప్రధాన కార్యదర్శిగా రెడ్డబోయిన సైదులు, మండల అసోసియేట్ అధ్యక్షుడుగా ఆర్ మల్లికార్జున్, మహిళా అసోసియేట్ అధ్యక్షరాలుగా ఏ ఉపదేశ, ఉపాధ్యక్షులుగా సూర్య, కార్యదర్శులుగా సుధాకర్ రెడ్డి, కోదండరాంరెడ్డి, మహిళా కార్యదర్శిలుగా మంజుల, పుష్పలతను ఎన్నుకున్నారు.






