యాసంగి పంటలపై రైతులకు అవగాహన సదస్సు
గుమ్మడిదల, మార్చి 2: కానుకుంట రైతు వేదికలో ప్రస్తుతం యాసంగి కాలంలో వివిధ పంటలలో సస్యరక్షణ చర్యల గూర్చి రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా పటాన్చెరు ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకా లు వినియోగించుకుంటూ రైతులు అభివృద్ధి సాధించాలని కోరారు.
మండల వ్యవసాయ అధికారి డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం వరి పంటలో తీసుకోవలసిన సస్య రక్షణ చర్యలు గూర్చి, నూతన వరి వంగడాలు, యూరియా యాప్ ద్వారా కొనుగోలు విధానం, రైతు రిజిస్ట్రేషన్ ఆవశ్యకత, సబ్సిడీపై అందించనున్నవివిధ పరికరాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కానుకుంట, రాంరెడ్డి బావి సర్పంచులు పెంటారెడ్డి, మహిపాల్ రెడ్ది, ఏఈఓ ఆస్మిత, ఏటీఎంఏ సిబ్బంది స్పందన, రోజా, సాయి, ఉపసర్పంచ్, ఆత్మ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.




