3 March, 2026 | 2:03 AM

మానవ సమాజ నిర్మాణంలో సైన్స్ పాత్ర ముఖ్యం

03-03-2026 12:24 AM

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

షాద్నగర్, మార్చి 2 (విజయక్రాంతి)మానవ సమాజ నిర్మాణంలో జ న్యుశాస్త్రం పాత్ర ప్రత్యేకమైనదని, ఈ విద్యార్థులు తె లుసుకోవడం ఎంతో అవసరమని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. రం గారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పద్మావతి కాలనీ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కోసం నూతనంగా ఏర్పాటుచేసిన సైన్స్ ల్యాబ్ ను షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్ లతో కలసి ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్.,అనంతరం విద్యార్థుల కోసం నూతనంగా ఏర్పాటు చేస్తున్న

వాష్ రూం లను పరిశీలించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ప్రధానోపాధ్యాయురాలు భాగ్యమ్మ ఆధ్వర్యంలో పాఠశాల విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని ఆ మెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్,కౌన్సిలరు దిలీప్, మురళీ మోహన్ (అప్పి),సాధిక్, ముబారక్ అలీ ఖాన్, అనిల్, చందు, ఖదీర్ ప్రదీప్ ముదిరాజ్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.