కేంద్ర గ్రంథాలయంలో భరోసా కేంద్రం అవగాహన సదస్సు
హనుమకొండ, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ భరోసా కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ లోని కేంద్ర గ్రంథాలయం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్, ఐడియల్ బ్యూటీ అకాడమీలో మహిళలకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానంగా భరోసా సేవలు, పితృస్వామ్యం, స్త్రీ ద్వేషం, లైంగిక దోపిడీ, బాల్య వివాహాలు, బాలలపై లైంగిక వేధింపులు, సైబర్ స్టాకింగ్, సైబర్ మోసాలు, సైబర్ సెక్యూరిటీ సైట్లు, యాప్ల సహాయ వ్యవస్థ, బాలల హెల్ప్లైన్-1098, సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ డయల్-1930 మొదలైన అంశాలపై భరోసా కేంద్రం ప్రతినిధులు హాజరైన విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు వివరించారు. భరోసా సిబ్బంది రేణుక, తేజశ్రీ,నీరజ, రజిత, అనూష, పవిత్ర, రజని పాల్గొన్నారు.






