29 April, 2026 | 3:47 AM

యువత ‘చేంజ్ మేకర్స్’గా ఎదగాలి

29-04-2026 02:21 AM
  1. దేశాభివృద్ధిలో అర్థవంతమైన పాత్ర పోషించాలి
  2. షేపింగ్ ది నెక్స్ జనరేషన్ లీడర్స్ కార్యక్రమంలో కేటీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): యువత మార్పును తెచ్చే ‘చేంజ్ మేకర్స్’గా ఎదగాలని దేశ అభివృద్ధిలో అర్థవంతమైన పాత్ర పోషించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో మంగళవారం జరిగిన స్ట్రీట్ కాజ్ షేపింగ్ ది నెక్స్ జనరేషన్ లీడర్స్ సదస్సులో కేటీఆ ర్ పాల్గొని మాట్లాడారు. కేటీఆర్‌తో జరిగిన ముఖాముఖి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా కేటీఆర్ తన బాల్య స్మృతులను, తన నాయకత్వ దృక్పథాన్ని ప్రభావితం చేసిన సందర్భాలను విద్యార్థులతో పంచుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధి గురించి వివరిస్తూనే, యువత మార్పును తెచ్చే ’చేంజ్ మేకర్స్’గా ఎదగాలని పిలుపునిచ్చారు. మారుతున్న సాంకేతికతకు అను గుణంగా విద్యార్థులు కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కేటీఆర్ సూచించారు. రాజకీయ నాయకులపై జెన్-జీ యువ తలో ఉండే సాధారణ అపోహల గురించి జరిగిన మిత్ వర్సెస్ ఫ్యాక్ట్ సెషన్ ఆసక్తికరంగా సాగింది. విద్యార్థుల ప్రశ్నలకు కేటీఆర్ నేరుగా సమాధానమిస్తూ, పాలన, ప్రజా జీవితంలోని వాస్తవాలను వివరించారు.