calender_icon.png 14 June, 2025 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన సదస్సు

13-06-2025 05:30:55 PM

ఆయిల్ ఫామ్ ఒక్కసారి నాటితే 30 ఏళ్ల వరకు అధిక ఆదాయం పొందవచ్చు

జిల్లా ఆయిల్ పేడ్ అధికారి శంకర్

నర్మెట,(విజయక్రాంతి): నర్మెట్ట మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆవరణలో తెలంగాణ ఆయిల్ ఫెడ్(Telangana Oil Fed) ఆధ్వర్యంలో ఆయిల్ ఫాం పంట(Oil Farm Crops)పై అవగాహన కార్యక్రమం(Awareness Seminarశుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనగాం జిల్లా ఆయిల్ ఫెడ్ మేనేజర్  శంకర్ మాట్లాడుతూ రైతులకు తగు సూచనలు ఇచ్చారు. ఆయిల్ ఫామ్  ముక్కలు ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు దిగుబడిస్తాయని, మొదటి మూడు సంవత్సరాల్లో అంతర పంటలు వేసుకోవచ్చు. దీనికి చీడపీడల బెడద ఎక్కువగా ఉండదు, కోతుల బెడద ఉండదు, అకాల వర్షాలు ఎదురుగాలులు వడగాలులో సమస్యలు ఉండవు.

బిందు సేద్యం ద్వారా నీరు మరియు ఎరువులు అందించవచ్చు 50% వరకు నీరు ఎరువులు ఆదాయం చేసుకోవచ్చు కూలీల ఖర్చు తగ్గుతుంది. గెలలు ప్రతి 15 రోజులకు ఒకసారి కోయవచ్చు అంతర పంటలుగా వరి కాకుండా అన్ని పంటలు వేసుకోవచ్చు ఎకరానికి ఖర్చులు పోను లక్ష యాభై వేల రూపాయలు ఆదాయం వస్తుంది. అంతర పంటలతో అదనపు ఆదాయం పొందవచ్చు. నాలుగు సంవత్సరాల పాటు నిర్వాహణ ఖర్చుల కింద ఎకరానికి 4200 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది గెలలు ఆయిల్ ఫీడ్ మాత్రమే కొనుగోలు చేస్తుంది అని అన్నారు  ఈ కార్యక్రమంలో నర్మెట మండల ఆయిల్ పేడ్ అధికారి  హరిబాబు పి ఎం ఓ  రాజేందర్ జైన్ డ్రిప్ కంపెనీ డిస్టిక్ కో ఆర్డినేటర్ భూసా రమేష్ యాదవ్  ఫీల్డ్ కోఆర్డినేటర్ మంచిల్లా   ప్రభాకర్ ఫినోలెక్స్ డ్రిప్ ఫీల్డ్ కోఆర్డినేటర్ తలకొక్కుల  వెంకటేశ్వర్లు రైతులు పాల్గొన్నారు