18 April, 2026 | 10:00 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు

20-06-2025 04:28 PM

వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): సీజనల్ వెదర్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్వాక్రా మహిళలకు కాఫీ ప్రత్యక్ష ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం జరిగింది. మండల పరిధిలోని మంగవాయి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సూర్య(Dr. Surya) పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... మీ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. దోమలు రాకుండా దోమతెరలు వేసుకోవాలని, ఇంటి చుట్టుపక్కల ఏమైనా నీరు నిల్వ ఉంటే శుభ్రంగా చేసుకోవాలని తెలియజేశారు.

వర్షా కాలంలో వర్షాలు ఎక్కువగా రావడం వల్ల విష జ్వరాలు చాలా మందికి వస్తాయని, కాచి చల్లార్చిన నీళ్లను తాగాలని, పరిశుభ్రమైన బట్టలు వేసుకోవాలని, ఇంటి చుట్టూ మురుగునీరు చేరకుండా శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వెంకటాపురం మండల కోఆర్డినేటర్ జి హనుమంత్ యానిమేటర్స్ పద్మ, ఇందిరా, ఉషా ప్రశాంత్, నరేష్, గ్రామస్తులు 70 మంది పాల్గొన్నారు.