7 April, 2026 | 6:57 PM

హెచ్పీవి వ్యాక్సిన్ పై అవగాహన సదస్సు

07-04-2026 05:18 PM

నిర్మల్,(విజయక్రాంతి): హెచ్పీవి వ్యాక్సిన్ తో భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్ను అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రియ నర్సింగ్ హోమ్ ఆవరణంలో అల్లుఅర్జున్ ఫ్యాన్స్ నిర్మల్ వారి ఆధ్వర్యంలో హెచ్పీవి వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్పీవి వ్యాక్సిన్ అనేది వైరస్ నుంచి రక్షణ కల్పించే టీకా అని పేర్కొన్నారు.

ఇది ముఖ్యంగా అమ్మాయిలకు గర్భాశయ కంఠం క్యాన్సర్ నుంచి కాపాడుతుందని చెప్పారు. దీనిపై ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొంతం గణేష్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ సాగర్, జై సాయి , అక్షయ్ కుమార్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.