సభ్యత్వ నమోదుపై రేపు అవగాహన
జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్
మేడ్చల్ అర్బన్, మే 29(విజయక్రాంతి): బిఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 31 న ఉదయం 10 గంటలకు మేడ్చల్ పట్టణంలోని శ్రీ గార్డెన్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంధాలయ మాజి ఛైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు పై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల డివిజన్ లలో పోలింగ్ కమిటీలపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మాజి మంత్రివర్యులు మేడ్చల్ బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డితో పాటు సభ్యత్వ నమోదు ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి,మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి చామకూర మహేందర్ రెడ్డి లు హాజరు కానున్నట్లు భాస్కర్ యాదవ్ వెల్లడించారు. బిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు...






