18 July, 2026 | 9:14 PM

Breaking News

జక్కాపూర్ జడ్పీహెచ్‌ఎస్‌లో రూ.40 లక్షల డైనింగ్ హాల్ ప్రారంభం   •   డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఆటోడ్రైవర్   •   రైతులకు నిరంతరాయంగా విద్యుత్తును అందించాలని నిరసన   •   సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   గోపాల్ మృతితో మరోసారి నేరెళ్ల ఘటనపై చర్చ   •   మహంకాళి ఆలయంలో డిసిసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ప్రత్యేక పూజలు   •   సిద్ధార్థలో స్కూల్ లీడర్స్ ప్రమాణ స్వీకారోత్సవం   •   గ్రామాలకు వెళ్లి ఎల్ నినో పరిస్థితులపై అవగాహన కల్పించాలి   •   గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం   •   ఎల్ నినో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఎంఏఓ   •  

రూ.500 కోట్లతో మానుకోట అభివృద్ధి

30-05-2026 12:38 AM

ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ 

మహబూబాబాద్, మే 29 (విజయక్రాంతి): మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటివరకు 500 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని, ఆ నిధులతో మానుకోట సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నామని, గత ప్రభుత్వం మాదిరిగా కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా, సంక్షేమం, అభివృద్ధిలో మానుకోటను ముందుండే విధంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు.

శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు నగదు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకుంటూ, ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, ముందుకు సాగుతుందని తెలిపారు. ఇచ్చిన మాటను ఎక్కడ కూడా తప్పకుండా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.