4 May, 2026 | 3:53 PM

Breaking News

మంత్రి శ్రీధర్ బాబుకు శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం   •   డంపింగ్ యార్డును తరలించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి   •   సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •  

రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు

04-05-2026 02:27 PM

వాంకిడి,(విజయక్రాంతి): రైతుల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికల కార్యక్రమంలో భాగంగా వాంకిడి మండలంలోని రైతు వేదికల్లో సోమవారం విస్తృత స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించారు. గ్రామ సర్పంచుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో రైతులకు వివిధ వ్యవసాయ అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మండల విస్తరణ అధికారులు మాట్లాడుతూ రైతులు పంటల దిగుబడులు పెంచుకునేందుకు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు.

విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా ఖర్చులు తగ్గించి లాభాలు పెంచుకోవచ్చని తెలిపారు. అలాగే పంటలకు ఎరువులు సరైన మోతాదులో, సరైన సమయంలో వాడే విధానంపై రైతులకు వివరంగా అవగాహన కల్పించారు. ఇక ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ ఐడి నమోదు చేసుకోవాలని అధికారాలు సూచించారు. దీనివల్ల ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.