4 May, 2026 | 3:38 PM

Breaking News

సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •  

కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్

04-05-2026 02:24 PM

​పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షుడి పట్టించుకోని వైనం

​ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా ఖాజా భక్ష్

కొత్తగూడెం,(విజయక్రాంతి): ​కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండీ ఖాజా భక్ష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటీవల జరిగిన ఎన్నికల్లో మైనారిటీలకు తగిన సీట్లు కేటాయించడంలో పార్టీ విఫలమైందని, ​తాను మైనారిటీ సెల్ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, తనకు కూడా పోటీ చేసే అవకాశం కల్పించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం మైనారిటీ నాయకులకు కనీస ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.

​"మైనారిటీల హక్కులకు, ఆత్మగౌరవానికి గుర్తింపు లేని పార్టీలో నేను కొనసాగలేను. అందుకే మనస్తాపంతో కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. భవిష్యత్తులో మైనారిటీలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఇచ్చే పార్టీలో చేరుతాను అని పత్రికముకంగా వెల్లడించారు. ​మైనారిటీల సమస్యలపై పోరాడేందుకు, వారి హక్కుల సాధన కోసం తన భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.