13-12-2025 12:00:00 AM
ఎస్బీఐ చీఫ్ మేనేజర్స్ రాకేష్ వర్మ, హరిలాల్
నాగర్ కర్నూల్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంపు అత్యంత అవసరమని ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్స్ రాకేష్ వర్మ హరిలాల్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నల్లవెల్లి రోడ్డులో ఉన్న ఎస్బిఐ బ్యాంక్, మెయిన్ రోడ్డులోని బ్యాంకు పరిధిలో వేరువేరుగా నిర్వహించిన సమావేశంలో బ్యాంకు ఉద్యోగులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు.
సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఖాతాదారులకు ఇవ్వాల్సిన సలహాలపై వివరించారు. ఖాతాదారుల వద్ద స్నేహభావంతో మెలిగి సైబర్ నేరాల పట్ల అప్రమత్తం చేయాలన్నారు. ప్రతి ఉద్యోగి సుమారు 5 మంది ఖాతాదారులకు చొప్పున అవగాహన కల్పిస్తూ వారు సామాన్య జనానికి అవగాహన కల్పించేలా సిద్ధం చేయాలన్నారు.
అవగాహన లేక చాలామంది బ్యాంకులను సంప్రదించడం లేదని సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలి అనే విషయాన్ని ప్రతి కస్టమర్కు బ్యాంకు సిబ్బంది తప్పనిసరిగా వివరించాలన్నారు. ముందుగా బాధితులు బ్రాంచ్ సిబ్బందినే సంప్రదిస్తారని, ఫ్రంట్లైన్ ఉద్యోగులు కస్టమర్లకు సరైన మార్గదర్శనం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ నరేశ్ కుమార్, ఫీల్ ఆఫీసర్ లీలావతి అన్నారు.