calender_icon.png 15 December, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని మోదీ విదేశీ పర్యటన

15-12-2025 08:54:08 AM

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మూడు దేశాల పర్యటనకు బయలుదేరారు. ఇవాళ్టి నుంచి మూడ్రోజులపాటు ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో బిజీగా ఉండనున్నారు. జోర్డాన్‌, ఇథియోపియా, ఒమన్‌ దేశాల్లో నరేంద్ర మోదీ(Narendra Modi) పర్యటించనున్నారు. ఇవాళ, రేపు బోర్డాన్ లో పర్యటించనున్నారు. 

కింగ్ అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్(Abdullah II of Jordan) ఆహ్వానం మేరకు జోర్డాన్‌ను సందర్శించడంతో మోదీ తన మూడు దేశాల పర్యటనను ప్రారంభించారు. ఇరు దేశాధినేతలు భారత్-జోర్డాన్ సంబంధాల నుండి కీలకమైన ప్రాంతీయ, ప్రపంచ సమస్యల వరకు అనేక విస్తృత అంశాలపై చర్చలు జరపనున్నారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగుతోంది. మోడీ పర్యటన జోర్డాన్‌లో ప్రారంభమై, డిసెంబర్ 16, 17 తేదీలలో ఇథియోపియాలో కొనసాగి, డిసెంబర్ 17-18 తేదీలలో ఒమన్‌లో ముగుస్తుంది.