calender_icon.png 13 December, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బియ్యం సంచుల్లో తరుగు!

13-12-2025 12:00:00 AM

  1. కాగితాల్లోనే లెక్కలు.. బస్తా లెక్కతోనే తూకం?
  2. తూకం వేసేది లేదు
  3. కిలోల చొప్పున- తక్కువ వస్తున్నాయని రేషన్ డీలర్ల ఆందోళన
  4. ఎంతొస్తే అంత పంపుతున్నాం:- సివిల్ సప్లయ్ డీఎం

మంచిర్యాల, డిసెంబర్ 12 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని 2,52,386 కార్డుదారులకు ప్రభుత్వం రేషన్ ద్వారా సన్న బియ్యం అందజేస్తుంది. ఈ బియ్యం మండల్ లెవల్ స్టాక్ (ఎంఎల్‌ఎస్) పాయిం ట్ల నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా అవుతుంది. ఈ క్రమంలో రేషన్ దుకాణాలకు కోటాకు అనుగుణంగా బియ్యం రావడం లేదని, తక్కువ వస్తుండటంతో నష్టం జరుగుతుందని రేషన్ డీలర్లు ఆందోళన చెందు తున్నారు.

మరోవైపు సివిల్ సప్లయ్ అధికారులేమో కోటాకు అనుగుణంగా పంపిస్తున్నామని చెపుతున్నారు. మంచిర్యాల జిల్లా లో మంచిర్యాల, లక్షెట్టిపేట, బెల్లంపల్లి, తాం డూరు, చెన్నూర్, కోటపల్లి మండల కేంద్రా ల్లో ఎంఎల్‌ఎస్ (మండల్ లెవల్ స్టాక్) పాయింట్ల నుంచి 423 చౌకధరల దుకాణాలకు రేషన్ బియ్యం సరఫరా అవుతున్నా యి.

మంచిర్యాల ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి జైపూర్, నస్పూర్, మంచిర్యాల, హాజీపూర్, మందమర్రి మండలాల్లోని 142 రేషన్ దుకాణాలకు, లక్షెట్టిపేట ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి లక్షెట్టిపేట, జన్నారం, దండేపల్లి మండలాల్లోని 81 రేషన్ దుకాణాలకు, బెల్లంపల్లి ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి బెల్లంపల్లి, కాసిపేట, నెన్నెల మండలాల్లోని 72 రేషన్ దుకాణాలకు, తాండూరు ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి తాండూరు, కన్నెపల్లి, భీమిని మండలాల్లోని 43 రేషన్ దుకాణాలకు, చెన్నూర్ ఎంఎల్‌ఎస్ పాయిం ట్ నుంచి చెన్నూర్, కోటపల్లి (8 దుకాణాలు), భీమారం మండలంలోని 52 రేషన్ దుకాణాలకు, కోటపల్లి ఎంఎల్‌ఎస్ పాయిం ట్ నుంచి కోటపల్లి (21 రేషన్ దుకాణాలు), వేమనపల్లి మండలంలోని 33 రేషన్ దుకాణాలకు రేషన్ బియ్యం తరలుతుంది.

50 కిలోల లోపే బస్తా బరువు!

జిల్లాలోని రేషన్ దుకాణాలకు వచ్చే బియ్యం బస్తాలు 50 కిలోల లోపే ఉండటం తో నెల నెలా పెద్ద మొత్తంలో రేషన్ కోల్పోతున్నామని డీలర్లు వాపోతున్నారు. ఎంఎల్ ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు బస్తాలో ఎంత బియ్యం ఉన్నాయనేది చూడకుండా బస్తాల కౌంటింగ్‌తోనే పంపిస్తున్నా రు. అలా పంపడం వలన ఒక్కో బస్తా 50 కిలోలకు రెండు నుంచి మూడు కిలోల తూకం తక్కువగా వస్తుందంటున్నారు.

స్టేజ్ 1 నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్ లకు వచ్చే సమయంలో తూకం వేసి తీసుకువస్తుండగా, అంతే పరిమాణం గల బియ్యం ఎం ఎల్‌ఎస్ పాయింట్‌కు చేరిందా అనేది తూకం వేస్తున్నారా? వేయకుండానే ఆ బియ్యాన్ని రేషన్ దుకాణాలకు పంపిస్తుండటం వల్ల తరుగు ఏర్పడుతుందనే అను మానాలు వ్యక్తమవుతున్నాయి. పేపర్ల మీద ఉన్నంత పరిమాణం గల బియ్యం ఎంఎల్‌ఎస్ పాయింట్లకు చేరుతుందా? చేరితే రేషన్ దుకాణాలకు వెళ్లేసరికి బస్తాల బరువు ఎందుకు తగ్గుతుందో సంబంధిత శాఖ అధికారులకు తెలియాలి. 

లెక్కలన్నీ కాగితాల్లోనే..

ఈ నెల 3వ తేదీన ‘విజయక్రాంతి’ దినపత్రికలో ‘నయా రేషన్ దందా..!’ పేరిట కథనం రాగా సివిల్ సప్లయ్ డీఎం కళ స్పందించారు. అంతా సజావుగానే సాగుతుందని, స్టేజ్ వన్ 1 నుంచి వచ్చిన బియ్యా న్ని రేషన్ దుకాణాలకు పంపిస్తున్నామని, తరుగు రావడం లేదంటూ పేర్కొన్నారు. జిల్లాకు ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నెల వరకు 47,885.489 మెట్రిక్ టన్నుల బియ్యం రాగా 47,895.052 (పీడీఎస్ కు 44,588.80, ఐసీడీఎస్ కు 562.75, హాస్టల్స్ కి 2075.02, ప్రభుత్వ పాఠశాలల్లో ఎండీఎంకు  668.48) మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని తెలిపారు.

అధికారులు తెలిపిన లెక్కల ప్రకారం ఎస్ డబ్ల్యూ సీ గోదాం ల నుంచి స్టేజ్ 1 ద్వారా జిల్లాకు వచ్చిన బియ్యం లెక్కకు, స్టేజ్ 2 ద్వారా రేషన్ దుకాణాలకు, ఐసీడీఎస్, హాస్టల్స్, మధ్యాహ్నా భోజనానికి పంపిన బియ్యం లెక్కలకు వ్యత్యాసం ఉంది. ఇదంతా లెక్కల్లో కాగితాలపైనే చూపిస్తున్న అధికారులు క్షేత్ర స్థాయి లో బస్తాల్లో తరుగు ఎందుకు, ఎక్కడ వస్తుం దో పరిశీలించడం లేదని ఆరోపణలున్నా యి. రేషన్ దుకాణాలతోపాటు ఐసీడీ ఎస్, హాస్టల్స్‌కి, ఎండీఎంలకు పంపించే బస్తాల్లో ఎన్ని కిలోల బియ్యం వస్తున్నాయో వారికి తెలియదు.

బియ్యం బస్తాల లెక్కతోనే దింపుకుంటామని, తంబ్ పెట్టిన సమయంలో తూకం వేసిన బియ్యం మాకు రావని, గోదాంలో నిలువ ఉన్న బియ్యం పంపిస్తారని, బస్తాలెక్కతోనే చూసుకుంటున్నామని మంచిర్యాలలోని ఒక హాస్టల్ వార్డెన్ పేర్కొన్నారు. అధికారులు ప్రకటిస్తున్న లెక్కలన్నీ లారీల తూకం వేసిన లెక్కలు కాకుండా కేవలం బస్తాల కౌంటింగ్ తో చేసిన లెక్కలేనని స్పష్టంగా తెలుస్తుంది. 

ఏ బస్తా అయినా 50 కిలోలకు తక్కువే

రేషన్ దుకాణంకు వచ్చే ఏ బస్తా అయి నా 50 కిలోలకు తక్కువగానే వ స్తోం ది. మాకు పం పించే లారీ బస్తాలు లెక్కతోనే పంపిస్తారు. చివరకు సంచి బరు వు కూడా కలుపమంటే ఇవ్వ రు. అడిగితే ఒకటి, రెండు బస్తాలు వేసి చేతులు దులుపుకుంటున్నరు. మాకు వచ్చే బస్తాలు బాగా తక్కువగా వస్తున్నాయని చెప్పినా ఎవరూ పట్టించు కోవడం లేదు. ఎంఎల్‌ఎస్ పాయింట్ ల నుంచి రేషన్ షాపునకు వచ్చేబి య్యానికి ఒక చోట తంబ్ తీసుకొని, తూకం వేసిన బియ్యం బస్తాలు కాకుం డా గోదాముల్లోని బియ్యం సంచులను లారీల్లో లోడ్ చేసి పంపిస్తున్నారు. 

 వంగపల్లి రవీందర్, 

రేషన్ డీలర్, మంచిర్యాల

ఎన్నిసార్లు చెప్పినా మార్పు రావడం లేదు

ప్రతి నెలా రేష న్ దుకాణాలకు వచ్చే బస్తాల్లో కిలో నుంచి రెండు కిలో ల బియ్యం తక్కువగా వస్తున్నాయని జిల్లా అధికారులకు చాలా సార్లు తెలిపినం. మాకిచ్చే ట్రక్ షీట్ లెక్కల ప్ర కారం బస్తాలు వస్తున్నాయి కానీ బస్తాల్లో బియ్యం తక్కువగా ఉండటం తో షార్టేజీ వస్తుంది. జేసీ, డీసీఎస్‌ఓ, సివిల్ సప్లయ్ డీఎంల దృష్టికి తీసుకువెళ్లినం. అయినా ఫలితం లేదు. డీలర్లందరం ఇలా నష్టపోతున్నాం. లారీలో ఎన్ని బస్తాలు వేస్తే ఎంత బరువు తూకం వచ్చిందో లారీతో కలిసి పంపించాలి. 

 మోటపలుకుల సత్తయ్య, అధ్యక్షుడు,

రేషన్ డీలర్ల సంఘం, మంచిర్యాల