15-12-2025 10:00:17 AM
హైదరాబాద్: టోలిచౌకి పోలీస్ స్టేషన్(Tolichowki Police Station) పరిధిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పారామౌంట్ కాలనీ గేట్ నంబర్-4(Paramount Colony Gate Number-4)లో ఈ ఘటన చోటుచేసుకుంది. సోదరుల మధ్య ఘర్షణ ఆపేందుకు వెళ్లి ఇర్ఫాన్(24) మృతి చెందాడు. నిందితుడు బిలాల్ ఇర్ఫాన్ ను కత్తితో పొడిచి హత్య చేశాడు. హంతకుడు బిలాల్ భార్యకి మృతుడు ఇర్ఫాన్ అన్న అద్నాన్ కి మధ్య ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బిలాల్, అద్నాన్ మధ్య గొడవ జరుగుతుందన్న విషయం తెలుసుకున్న ఇర్ఫాన్ అక్కడికి వచ్చాడు. ఈ క్రమంలో గొడవ పెద్దది కావడంతో బిలాల్ కత్తితో ఇర్ఫాన్ పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పడికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నామని టోలిచౌకి పోలీసులు పేర్కొన్నారు.