15-12-2025 08:37:20 AM
ఉగ్రవాదుల బీభత్సం
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో మృతుల(Death Toll Rise) సంఖ్య 16కు పెరిగింది. ఆదివారం నాడు సిడ్నీలో బాండీ బీచ్(Bondi Beach shooting)లో ఇద్దరు ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. బీచ్ లోకి ప్రవేశించి పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బీచ్ లో యూదులు హనుక్కా వేడుకలు(Hanukkah Celebrations) చేసుకుంటుండగా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో చిన్నారితో పాటు ఓ పోలీసు అధికారి మృతి చెందారు. పోలీసుల కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. యూదులపై కాల్పుల ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. గాయపడిన 40 మందికి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.