calender_icon.png 16 December, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

13-12-2025 12:00:00 AM

  1. కలెక్టర్ సిక్తా పట్నాయక్

కలెక్టర్, అబ్జర్వర్ సమక్షంలో.. 

రెండవ విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది మూడో ర్యాండమైజేషన్ పూర్తి

నారాయణపేట, డిసెంబర్ 12 (విజయక్రాంతి) : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం  జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో రెండవ విడతలో ఎన్నికలు జరుగనున్న  నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్ మండలాల పోలింగ్ సిబ్బంది మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సీతాలక్ష్మి సమక్షంలో నిర్వహించారు.

ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించిన ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించారు.  ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ.ఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ నాటికే ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాలతో కూడిన గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరపాల్సిన అవసరం లేకపోవడం వల్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ నుంచి మినహాయింపు కల్పించారు.

స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు.  రెండవ విడతలో  828 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, 20 శాతం అదనంగా సిబ్బందిని రిజర్వ్ లో ఉంచుతూ ర్యాండమైజేషన్ జరిపారు. ఈ కార్యక్రమంలో  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.