పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలి
ప్రిన్సిపాల్ కె.ఉమారాణి.
మరిపెడ, ఫిబ్రవరి 24(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె.ఉమారాణి అన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ బాలుర డిగ్రీ కళాశాల మరిపెడ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఆనేపురం గ్రా మంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
శిబిరం నిర్వహిస్తున్న గ్రామ పరిసర ప్రాంతాల్లో, రహదారి ఇరువైపులా, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో వివిధ రకాల నీడనిచ్చే, ఫలదాయకమైన మొక్కలను నాటారు. ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు స్వ యంగా గుంతలు తవ్వి మొక్కలు నాటడం ద్వారా శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె.ఉమారాణి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రచేతన్ లు మాట్లాడుతూ చెట్లు ప్రకృతికి ఊపిరి అని, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలకు వృక్ష సంరక్షణే శాశ్వత పరిష్కారమని తెలిపారు.
ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడుకోవడం కూడా ముఖ్యమని, వనమహోత్సవాన్ని ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతర ఉద్యమంగా కొనసాగించాలని సూచించారు. ఇంటి ఇంటికి తిరిగి గ్రామ మరుగుదొడ్ల సర్వే నిర్వహించారు. బహిరంగ మల మూత్ర విసర్జన చేయకూడదని ,ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సంధ్య,డా వి.సరిత.స్వప్నకుమారి,లక్ష్మీ ప్రసన్న,యాకుబ్, రత్నమాల, సునీత, దీపిక, సెక్రటరీ గుగులోత్ రామోజీ, సర్పంచ్ వసుమతి యాకన్న, వార్డు సభ్యులు మరియు హెడ్ మాస్టర్ నిజాం పాషా మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




