అయోధ్య ట్రస్ట్ విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం
అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపన్ రాయ్ రాజీనామా
యూపీ: అయోధ్య ట్రస్ట్ విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్(Ayodhya Trust General Secretary Champat Rai resigns) రాజీనామా చేశారు. చంపత్ రాయ్ తో పాటు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేశారు. వీహెచ్ పీ ఆదేశాలతో చంపత్ రాయ్ రాజీనామా చేశారు. అయోధ్యలో 42 రోజుల్లో 70 దొంగతనాలు జరిగాయి. సిట్ అధికారుల దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అయోధ్య విరాళాల కేసులో సిట్(Special Investigation Team) స్పీడ్ పెంచింది. ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు అయోధ్య పోలీసులు ప్రకటించారు. ఈ ఎనిమిది మందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సుమారు 7 నుంచి రూ. 7.5 కోట్లు మాయం అయినట్లు ఆరోపణలున్నాయి. రామ జన్మభూమి ట్రస్ట్(Ram Janmabhoomi Trust) సభ్యుడు కృష్ణమోహన్ ఫిర్యాదు ఆధారంగా అయోధ్య పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అరెస్టు అయిన ఎనిమిది మంది వివరాలను పోలీసులు ఎఫ్ఐఆర్(First Information Report) లో చేర్చారు. విరాళాలు, విలువైన కానుకలు స్వీకరించడం, నగదు లెక్కింపులో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిది మందిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.






